రంగస్థలం… అప్పటివరకు రామ్ చరణ్ నటనపై ఉన్న అన్ని అనుమానాలను చెదరగొట్టిన సినిమా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చరణ్ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. అందుకే మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే RC17 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా వస్తుందని రామ్ చరణ్, సుకుమార్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల దశకు చేరుకోవడంతో, సుకుమార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా బరిలోకి తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో చరణ్ నటించిన ‘మగధీర’, ‘ధ్రువ’ వంటి సినిమాలు కూడా పండగ సీజన్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ సుకుమార్ కాంబోలో మళ్లీ రిపీట్ అయితే, దసరా సీజన్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాదు… ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈసారి ఆమె గ్లామర్ పాత్రలో కాకుండా, కథను కీలక మలుపు తిప్పే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం.
సుకుమార్ సినిమాల్లో మహిళా పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రంగస్థలం’లో సమంత, ‘పుష్ప’లో అనసూయ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చరణ్ సినిమాకోసం కూడా అలాంటి బలమైన పాత్రనే సుకుమార్ డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నయనతార ఎంట్రీ నిజమైతే, సినిమా స్థాయి మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ఇక ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రూటెడ్ రస్టిక్ డ్రామాగా ఉండబోతోందట. ‘రంగస్థలం’లో గోదావరి యాసతో మెప్పించిన రామ్ చరణ్, ఈసారి తెలంగాణ యాసలో ఊర మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడని చెబుతున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో ఎస్. థమన్ లేదా యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజమవుతాయా? లేక రూమర్స్‌గానే మిగిలిపోతాయా? అన్నది తెలియాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









