Search
Close this search box.

  ఐకాన్ స్టార్ మనసులో ‘సీతారామం’ బ్యూటీ: మృణాల్‌తో సినిమా చేయాలనుందన్న అల్లు అర్జున్!

February 26, 2026 7:56 PM | Aditya369 News

ఐకాన్ స్టార్ మనసులో ‘సీతారామం’ బ్యూటీ: మృణాల్‌తో సినిమా చేయాలనుందన్న అల్లు అర్జున్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటించాలనే తన ఆసక్తిని బహిరంగంగా వెల్లడించారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 70వ ఫిల్మ్‌ఫేర్ (South) అవార్డు గెలుచుకున్న బన్నీకి, మృణాల్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ పూల బొకే మరియు సందేశాన్ని పంపారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్, భవిష్యత్తులో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో మృణాల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. "మీ అభినందన చాలా మధురంగా ఉంది. ఎప్పటికైనా మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. మృణాల్ పంపిన నోట్‌లో బన్నీ అంకితభావాన్ని, నటనలోని తీవ్రతను ప్రశంసించగా, దానికి బన్నీ ఇచ్చిన రిప్లై చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 3'తో పాటు లోకేశ్ కనగరాజ్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులతో బిజీగా ఉండబోతున్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్, అడివి శేష్‌తో కలిసి నటించిన 'డకాయిట్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ స్టార్స్ ఇద్దరూ అనుకున్నట్లుగా ఏదైనా భారీ ప్రాజెక్టులో కలిసి కనిపిస్తారేమో వేచి చూడాలి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటించాలనే తన ఆసక్తిని బహిరంగంగా వెల్లడించారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 70వ ఫిల్మ్‌ఫేర్ (South) అవార్డు గెలుచుకున్న బన్నీకి, మృణాల్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ పూల బొకే మరియు సందేశాన్ని పంపారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్, భవిష్యత్తులో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్ తన పోస్ట్‌లో మృణాల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. “మీ అభినందన చాలా మధురంగా ఉంది. ఎప్పటికైనా మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. మృణాల్ పంపిన నోట్‌లో బన్నీ అంకితభావాన్ని, నటనలోని తీవ్రతను ప్రశంసించగా, దానికి బన్నీ ఇచ్చిన రిప్లై చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 3’తో పాటు లోకేశ్ కనగరాజ్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులతో బిజీగా ఉండబోతున్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్, అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డకాయిట్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ స్టార్స్ ఇద్దరూ అనుకున్నట్లుగా ఏదైనా భారీ ప్రాజెక్టులో కలిసి కనిపిస్తారేమో వేచి చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు