Search
Close this search box.

  కాక్‌టెయిల్ 2: రష్మిక, కృతి సనన్ పాత్రలపై షాకింగ్ అప్‌డేట్.. సరికొత్త ప్రయోగం?

February 20, 2026 7:34 PM | Aditya369 News

కాక్‌టెయిల్ 2: రష్మిక, కృతి సనన్ పాత్రలపై షాకింగ్ అప్‌డేట్.. సరికొత్త ప్రయోగం?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ చిత్రంపై సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా, హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీరిద్దరూ స్వలింగ ప్రేమికులుగా (LGBTQ+ నేపథ్యం) కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రయోగాత్మక పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని, ఇదొక విభిన్నమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె నటించిన సూపర్ హిట్ ‘కాక్‌టెయిల్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మొదటి భాగం ముగ్గురు స్నేహితుల మధ్య సాగే ప్రేమకథగా అలరించగా, రెండో భాగంలో రష్మిక-కృతి పాత్రల మధ్య కెమిస్ట్రీ సరికొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ పాత్రల ద్వారా రష్మిక బాలీవుడ్‌లో మరో పెద్ద బ్రేక్ అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో షాహిద్ కపూర్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తారని దర్శకుడు వెల్లడించారు. జనవరి 31తోనే షూటింగ్ పూర్తి కావడంతో, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అధికారికంగా ఈ పాత్రల స్వభావంపై క్లారిటీ రాకపోయినప్పటికీ, ఈ తాజా అప్‌డేట్ మాత్రం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. విభిన్న పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకుంటున్న రష్మికకు ఇది మరో పెద్ద సవాల్‌గా మారనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు