Search
Close this search box.

  బాల్య వివాహాలు నేరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గరాణి

February 20, 2026 4:59 PM | Aditya369 News

బాల్య వివాహాలు నేరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గరాణి

బాల్య వివాహాలు చేయడం నేరం అని జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గరాణి అన్నారు. మండలంలోని రాపర్తి జెడ్పి ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ కె .సత్యనారాయణమ్మ హాజరయ్యి మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం,నేరం అని అన్నారు. బాల్యవివాహాలు చేయడం వలన శారీరకంగా,మానసికంగా పరిపక్వత చెందరని,అనేక సమస్యలను ఎదుర్కొంటారన్నారు.బాల్య వివాహాలు నుండి బాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడు పై ఉందన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధించిన,లైంగిక వేధింపులకు గురిచేసిన, ప్రలోబాలకు పాల్పడిన,బాల్య వివాహాలు సమాచారం, బాలలను అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ 112 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,జెవివి సభ్యురాలు మంగతాయరు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు