Search
Close this search box.

  బాలీవుడ్ బడా హీరోతో బోయపాటి సినిమా..?

January 30, 2026 11:53 AM | Aditya369 News

బాలీవుడ్ బడా హీరోతో బోయపాటి సినిమా..?

బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ సెన్సేషనల్ టాక్ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా, ఇటీవల బోయపాటి ముంబైకి వెళ్లి రావడం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఫైనల్ అవుతుందా? అనే చర్చలు ఊపందుకున్నాయి.

బోయపాటి అంటేనే మాస్ యాక్షన్, హీరో ఎలివేషన్లు, పవర్‌ఫుల్ సీక్వెన్సులు అనే బ్రాండ్ ఉంది. కానీ ఇటీవల బాలకృష్ణతో చేసిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆయనకు ఇది చిన్న షాక్‌లా మారింది. ఇలాంటి సమయంలో రణవీర్ సింగ్ లాంటి నేషనల్ స్టార్‌తో సినిమా చేయడం బోయపాటికి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్ మార్కెట్‌లో తన సత్తా చాటే ఛాన్స్ కూడా దక్కుతుంది.

మరోవైపు రణవీర్ సింగ్ పరిస్థితిని చూస్తే, ఇటీవల ‘ధురంధర్’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఆ విజయంతో రణవీర్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే అతను ‘ప్రళయ్’ అనే జాంబీ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో తన పాత్రకు భారీ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేయిస్తున్నాడని టాక్. ఇకపై తన సినిమాల్లో క్యారెక్టర్ డెప్త్, పవర్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట రణవీర్.

ఇలాంటి పరిస్థితుల్లో బోయపాటి స్టైల్ మాస్ సినిమాకి రణవీర్ ఎలా రిస్పాండ్ అవుతాడన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తి. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో హీరో పాత్ర ఎలివేషన్లు, యాక్షన్, మాస్ మూమెంట్స్‌తో నిండుగా ఉంటుంది. అదే సమయంలో డైరెక్టర్ పట్టు కూడా బలంగా ఉంటుంది. మరి ఈ ఇద్దరి క్రియేటివ్ ఆలోచనలు ఎలా మ్యాచ్ అవుతాయి? అనేది చూడాలి.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరోతో ఫైనల్ చర్చలే మిగిలాయని వినిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమా బోయపాటి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కావచ్చని అంటున్నారు. అదే సమయంలో రణవీర్‌కు ఓ కొత్త మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు