Search
Close this search box.

  వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

January 30, 2026 11:50 AM | Aditya369 News

వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వినగానే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడటం సహజం. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డు అందించడం రాజమౌళి స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్ వీడియో సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.

2027లో గ్రాండ్ రిలీజ్

ఇటీవల విడుదలైన మరో స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల వారణాసిలో ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హోర్డింగ్‌పై ‘ఏప్రిల్ 7’ అనే తేదీ మాత్రమే ఉండటంతో, ఇదే వారణాసి సినిమా రిలీజ్ డేట్ అని అభిమానులు భావిస్తూ పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు.

సినిమా పేరు లేకుండా హైప్ – జక్కన్న స్టైల్ పబ్లిసిటీ

ఆ హోర్డింగ్‌లో సినిమా పేరు లేకపోవడం, లోగో లేకుండా కేవలం తేదీ మాత్రమే ఉండడం విశేషం. కానీ బ్యాక్‌గ్రౌండ్ థీమ్, కలర్ గ్రేడింగ్ మాత్రం విడుదలైన వారణాసి ఫస్ట్ లుక్ గ్లింప్ను పోలి ఉండడంతో, ఇది రాజమౌళి మార్క్ పబ్లిసిటీ స్టంట్‌గా అభిమానులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఏప్రిల్ 7 ఉగాది పండుగ కావడంతో, ఆ రోజు సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇలా సినిమా పేరు చెప్పకుండా కూడా హైప్ క్రియేట్ చేయడంలో రాజమౌళికి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది.

ప్రమోషన్లలో రాజమౌళి తర్వాతే ఎవ్వరైనా!

సినిమా టైటిల్ లేకుండా, లోగో లేకుండా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం అంటే అది జక్కన్న స్టైల్ మాత్రమే. ఈ పోస్టర్ వైరల్ కావడంతో, అభిమానులు ఇప్పటికే వారణాసి – ఏప్రిల్ 7 రిలీజ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

షూటింగ్ అప్‌డేట్

ఇక షూటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore