Search
Close this search box.

  తెలంగాణలో ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల ఉత్కంఠ: రూ. 1000 కి ప్రీమియర్ షో టికెట్?

January 6, 2026 11:28 PM | Aditya369 News

తెలంగాణలో ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల ఉత్కంఠ: రూ. 1000 కి ప్రీమియర్ షో టికెట్?

దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, అంతకంటే ఒకరోజు ముందుగానే అంటే జనవరి 8న రాత్రి 9 గంటల నుంచి తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక షోల కోసం సింగిల్ స్క్రీన్లలో రూ. 800, మల్టీప్లెక్స్‌లలో రూ. 1000 (జీఎస్టీ అదనం) ధరను నిర్ణయించేలా అనుమతి ఇవ్వాలని నిర్మాతలు ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాశారు.
కేవలం ప్రీమియర్ షోలే కాకుండా, జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోలకు (బెనిఫిట్ షోలు) కూడా అనుమతి ఇవ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కోరింది. సాధారణ షోలకు సైతం సింగిల్ స్క్రీన్లలో రూ. 102, మల్టీప్లెక్స్‌లలో రూ. 132 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతుల ప్రక్రియ సాఫీగా సాగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం గతంలోని కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో నైజాం ప్రాంతంలోని ప్రభాస్ అభిమానులు టెన్షన్‌లో ఉన్నారు.
మరోవైపు, ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A 16+ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా ఖరారైంది. చిత్రంలో హింసాత్మక దృశ్యాలను తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించడంతో, కొన్ని సీన్లను బ్లాక్ అండ్ వైట్‌లోకి మార్చడం మరియు మరికొన్ని సెకన్ల పాటు కత్తిరించడం వంటి మార్పులు చేశారు. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా, నార్త్ అమెరికాలో అప్పుడే 4.25 లక్షల డాలర్ల మార్కును దాటి రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore