Search
Close this search box.

  సంక్రాంతి రేసులో మెగాస్టార్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

January 3, 2026 5:20 PM | Aditya369 News

సంక్రాంతి రేసులో మెగాస్టార్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా విడుదల చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్‌లో చిరంజీవితో పాటు నటులు హర్షవర్ధన్, హీరోయిన్ కేథరిన్ ట్రెసా, అభినవ్ గోమఠం కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో (Extended Cameo) కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘మెగా విక్టరీ మాస్’ వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ కలిసి చేసిన సందడి థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్ హ్యూమర్ మరియు మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను వింటేజ్ చిరంజీవి స్టైల్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రచార పర్వంలో భాగంగా అత్యంత కీలకమైన థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 04న తిరుపతిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుమారు 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉండనున్న ఈ ట్రైలర్ కోసం ఎడిటింగ్ పనులు పూర్తయ్యాయని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు