Search
Close this search box.

  ఫిబ్రవరిలో ‘కల్కి 2’ సెట్స్‌లోకి ప్రభాస్: ‘స్పిరిట్’కు చిన్న బ్రేక్!

December 31, 2025 8:23 PM | Aditya369 News

ఫిబ్రవరిలో ‘కల్కి 2’ సెట్స్‌లోకి ప్రభాస్: ‘స్పిరిట్’కు చిన్న బ్రేక్!

విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర సీక్వెల్ 'కల్కి 2' షూటింగ్ 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కేవలం పరిచయానికే పరిమితమైన కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) పాత్ర, రెండో భాగంలో ప్రభాస్ (భైరవ)తో తలపడే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ భారీ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే 'కల్కి 2' షూటింగ్ కోసం స్పిరిట్ చిత్రానికి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనివల్ల ప్రభాస్ తన లుక్ మరియు డేట్స్‌ను నాగ్ అశ్విన్ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. కల్కి పార్ట్-2 షూటింగ్ కోసం సుమారు 25-30 రోజుల వరకు పాత ఫుటేజ్ ఉన్నప్పటికీ, మిగిలిన భాగాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించేందుకు వైజయంతీ మూవీస్ భారీ వ్యయంతో రంగం సిద్ధం చేస్తోంది.
మరోవైపు, కల్కి సీక్వెల్‌లో హీరోయిన్ మార్పుపై కూడా గట్టి చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొణె స్థానంలో కొత్త హీరోయిన్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2026 జనవరి 9న 'రాజా సాబ్' విడుదలైన వెంటనే, ఫిబ్రవరిలో ప్రభాస్ కల్కి సెట్స్‌లో అడుగుపెట్టడం ఆయన అభిమానులకు నిజంగా నూతన సంవత్సర కానుక అని చెప్పవచ్చు.

విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర సీక్వెల్ ‘కల్కి 2’ షూటింగ్ 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కేవలం పరిచయానికే పరిమితమైన కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) పాత్ర, రెండో భాగంలో ప్రభాస్ (భైరవ)తో తలపడే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ భారీ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ‘కల్కి 2’ షూటింగ్ కోసం స్పిరిట్ చిత్రానికి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనివల్ల ప్రభాస్ తన లుక్ మరియు డేట్స్‌ను నాగ్ అశ్విన్ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. కల్కి పార్ట్-2 షూటింగ్ కోసం సుమారు 25-30 రోజుల వరకు పాత ఫుటేజ్ ఉన్నప్పటికీ, మిగిలిన భాగాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించేందుకు వైజయంతీ మూవీస్ భారీ వ్యయంతో రంగం సిద్ధం చేస్తోంది.

మరోవైపు, కల్కి సీక్వెల్‌లో హీరోయిన్ మార్పుపై కూడా గట్టి చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొణె స్థానంలో కొత్త హీరోయిన్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2026 జనవరి 9న ‘రాజా సాబ్’ విడుదలైన వెంటనే, ఫిబ్రవరిలో ప్రభాస్ కల్కి సెట్స్‌లో అడుగుపెట్టడం ఆయన అభిమానులకు నిజంగా నూతన సంవత్సర కానుక అని చెప్పవచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore