బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పాల్గొన్న కంటెస్టెంట్, చిట్టి పికిల్స్ రమ్య గురించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. ఆమె ఎందరికో ఆదర్శమని, స్ఫూర్తిదాయకమైన రమ్య లాంటి మహిళలను ప్రోత్సహించి గెలిపించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రమ్య ఈ షోలో చివరి వరకు ఉండాల్సిందని, ఆమె ఎలిమినేట్ కావడం దారుణమని ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో తనూజ రన్నరప్‌గా నిలవగా, విజేత కల్యాణ్ ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల భారీ ప్రైజ్ మనీని బహుమతిగా అందుకున్నారు. ఈ సీజన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి కల్యాణ్ పడాల విజయంతో ముగిసింది.








