Search
Close this search box.

  120 దేశాల్లో “SSMB29” రిలీజ్..? ఏం ప్లాన్ చేస్తున్నావు జక్కన్న..?

September 3, 2025 11:31 PM | Aditya369 News

120 దేశాల్లో “SSMB29” రిలీజ్..? ఏం ప్లాన్ చేస్తున్నావు జక్కన్న..?

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో మరింత సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాన్-ఇండియా మార్కెట్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకున్న ఆయన, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ప్రణాళికలు వేసుకుంటున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం “గ్లోబల్ ట్రెట్టర్” అనే వర్కింగ్ టైటిల్‌తో సంబోధిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలో ఈ సినిమా ముఖ్యమైన షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. అయితే, అనూహ్యంగా నిన్న రాత్రి నుంచి ఈ సినిమా ఏకంగా 125 దేశాల్లో విడుదల కానుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తప్ప, ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడూ స్పందించలేదు.

కానీ ఇప్పుడు, 120 దేశాల్లో రిలీజ్ అవుతోందని, హాలీవుడ్ కంపెనీలు కూడా ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నాయని ప్రచారం గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల “పారడైజ్” సినిమాకు ప్రమోషన్స్ నిర్వహించిన అమెరికన్ ఏజెన్సీ B S Promotions Agency మరియు Connect Mob Store కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారనే సమాచారం మరింత హైప్‌ను పెంచుతోంది. రాజమౌళి ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రమోషన్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తారని అందరికీ తెలుసు, కానీ ఈ హైప్‌కు ఆయనకు నిజంగా సంబంధం ఉందా లేదా అన్నది స్పష్టత రాలేదు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ 2 లాంటి గ్లోబల్ రిలీజ్ కూడా మొదటి వారం 49 మార్కెట్ల వరకే పరిమితమైంది. సాధారణంగా ఇండియన్ సినిమాలు ఓవర్సీస్‌లో విడుదలయ్యే మార్కెట్లు నార్త్ అమెరికా, యూకే, జపాన్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్, ఫ్రాన్స్ వరకే ఉంటాయి. ఆఫ్రికన్ దేశాల్లో కూడా విడుదల చేస్తారు కానీ, అవి పెద్ద సంఖ్యలో ఉండవు — గరిష్టంగా 12 దేశాలు మాత్రమే, అదీ నామమాత్రంగానే. అందుకే, 120 దేశాల రిలీజ్ వార్తలు కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీని పీఎస్ వినోద్ నిర్వహిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు