రణ్వీర్ సింగ్ హీరోగా, ‘యురి’ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar Movie) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సారా అర్జున్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, విడుదలైన రెండో శుక్రవారం రోజున ₹34.70 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ కలెక్షన్లతో ‘ధురంధర్’ చిత్రం హిందీలో ‘పుష్ప-2’ (₹27.50 కోట్లు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రెండో శుక్రవారం రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ‘ఛావా’, ‘యానిమల్’, ‘గదర్-2’, హిందీ ‘బాహుబలి-2’ వంటి సినిమాలు ఉన్నాయి.
ఓవరాల్‌గా ఈ ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. స్టార్ కాస్టింగ్, అద్భుతమైన సన్నివేశాలు, పాటలు కలగలిపి ఈ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని, కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం సాధించిన ఘన విజయం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై రణ్వీర్ సింగ్ స్థాయిని పెంచింది.









