పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన క్రేజ్‌ను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నారు. జపాన్‌లో జరిగిన ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఆయన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
సరికొత్త లుక్: ఈ ఈవెంట్‌లో ప్రభాస్ ట్రెండీ కాస్ట్యూమ్స్లో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ లుక్ జపాన్ అభిమానులతో పాటు ఇండియన్ సినీ లవర్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది.
-
అభిమానుల అంచనా: ప్రభాస్ తాజా లుక్ చూసిన అభిమానులు.. ఇది ఆయన తదుపరి సినిమా ‘స్పిరిట్’ కోసం అయి ఉంటుందేమో అని అంచనా వేస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ప్రభాస్ జపనీస్ భాషలో అందరినీ విష్ చేసి ఆకట్టుకున్నారు.
జపాన్‌లో ‘అమరేంద్ర బాహుబలి’ అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








