దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)-2025 అవార్డుల వేడుక ముంబైలో బాలీవుడ్, టాలీవుడ్ తారల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, చిత్రాలకు అవార్డులు అందించారు. తెలుగు సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం విశేషం.
ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), ఉత్తమ నటిగా కృతిసనన్ (Kriti Sanon) అవార్డులు అందుకున్నారు. హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2) బెస్ట్ మూవీ అవార్డును గెలుచుకుంది. అలాగే, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్‌గా దినేశ్ విజన్ అవార్డులను దక్కించుకున్నారు.
ఇతర ముఖ్య విజేతలుగా, ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందుకోగా, ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని శిల్పాశెట్టి గెలుచుకున్నారు. అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు జీనత్ అమన్‌కు, అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డు ఉషా ఉతుప్‌కు దక్కాయి. వెబ్ సిరీస్ విభాగంలో ‘హీరామండి’ బెస్ట్ వెబ్‌సిరీస్‌గా నిలవగా, జితేంద్ర కుమార్ (బెస్ట్ యాక్టర్, వెబ్‌సిరీస్), హ్యుమా ఖురేషి (బెస్ట్ యాక్ట్రెస్, వెబ్‌సిరీస్) అవార్డులు గెలుచుకున్నారు.









