Search
Close this search box.

  బాహుబలి ది ఎపిక్’‌కి మహేష్ బాబు కొడుకు గౌతమ్ సూపర్ రివ్యూ: “మెంటల్ వచ్చేసింది!”

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ ఫిల్మ్, అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి ఒక రోజు ముందు జరిగిన ఓవర్సీస్ ప్రీమియర్ షోను వీక్షించిన గౌతమ్, సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. “ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ లో ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్” అని, “ప్రతి సెకనుకు నాకు గూస్‌బంప్స్‌ వస్తూనే ఉన్నాయి. మెంటల్ వచ్చేసింది” అని తన ఉద్వేగాన్ని పంచుకున్నారు.

గౌతమ్ తన సమీక్షలో చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ఆదరణ దక్కడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఇప్పుడు రెండు భాగాలను ఒకేసారి చూడడం గ్రేటెస్ట్ ఫీలింగ్ అని అభిప్రాయపడ్డారు. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇదొక ‘ఎపిక్ మూవీ’ అని, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉందని గౌతమ్ పేర్కొన్నారు.

సాధారణంగా గౌతమ్ ఘట్టమనేని బయట పెద్దగా మాట్లాడకుండా, చాలా సైలెంట్‌గా ఉంటారు. సోదరి సితార యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, గౌతమ్ మాత్రం వాటికి దూరంగా ఉంటాడు. కానీ, ‘బాహుబలి’ గురించి ఆయన మాట్లాడిన తీరు, వాయిస్ బేస్ మరియు సినిమాపై ఆయనకున్న అవగాహన చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ గౌతమ్ మాటకారిని మెచ్చుకుంటూ, భవిష్యత్తులో హీరోగా వస్తే ఆయన వాయిస్ బాగా ప్లస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి, రాజమౌళి – మహేష్ కాంబోలో రాబోయే ‘SSMB 29’ గురించి తనను ఏమీ అడగవద్దని గౌతమ్ సరదాగా తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు