Search
Close this search box.

  మెగా 158′ కోసం చిరంజీవి-బాబీ కొల్లి క్రేజీ కాస్టింగ్ ప్లాన్!

‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (K.S. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం కోసం బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ ఫార్ములాను ఫాలో అవుతూ, చిరంజీవి ప్రధాన పాత్రతో పాటు మరో పవర్‌ఫుల్ పాత్రను జోడించాలని చూస్తున్నారట. ఈ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం గెస్ట్ అప్పియరెన్స్ కాదని, కార్తీ ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారని తమిళ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కార్తీ తెలుగులో నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించారు.

ఈ రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఇతర ముఖ్య పాత్రల కోసం కూడా టాప్ నటీనటులను ఎంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళ నటి మాళవికా మోహనన్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో లేదా కీలకమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించవచ్చని సమాచారం. ఇటీవల ‘మహారాజ’ సినిమాలో నెగెటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటనకు ప్రశంసలు దక్కాయి.

KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కార్తీ మరియు అనురాగ్ కశ్యప్‌తో పాటు మరికొంతమంది ప్రముఖ నటీనటుల ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు