Search
Close this search box.

  ‘కాంతార 1’ అద్భుతం: రిషబ్ శెట్టిని ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా, విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా, ఈ చిత్రం 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ అద్భుతమైన విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.

‘కాంతార చాప్టర్ 1’ సినిమా చూసిన అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. “వావ్.. మైండ్ బ్లోయింగ్ సినిమా. చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. రైటర్‌గా, దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో చేశారని, ప్రతి క్రాఫ్ట్‌లోనూ రాణించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. నటీనటులందరితో పాటు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి, స్టంట్స్ చేసిన అర్జున్ రాజ్ అద్భుతమైన పనితీరు కనబరిచారని అల్లు అర్జున్ కొనియాడారు.

నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబాలే ఫిల్మ్స్ టీమ్‌కు కూడా అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. “నిజంగా ఈ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు” అని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ పోస్ట్‌పై రిషబ్ శెట్టి వెంటనే స్పందిస్తూ.. “లవ్లీ విషెస్ కి థ్యాంక్యూ. మీ ఆప్యాయతకు మద్దతుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఎల్లప్పుడూ విజయం చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ రిప్లై ఇచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు