టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్, నటి శిరీష (సిరి లేళ్ల) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు పెళ్లి డేట్‌ను ఖరారు చేసుకున్నారు. వీరి వివాహం అక్టోబర్ 30న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ వివాహ వేడుకలు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.
నారా రోహిత్ మరియు శిరీషల వివాహ వేడుకలు అక్టోబర్ 25 నుండి 29 వరకు జరగనున్నాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకను నిర్వహించనుండగా, అక్టోబర్ 26న రోహిత్‌ను పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఈ నెల 28న మెహందీ వేడుక మరియు 29న సంగీత్ కార్యక్రమం ఉంటుంది. ఈ వేడుకల కోసం ఇప్పటికే అధికారికంగా పనులు కూడా ప్రారంభించారు.
ప్రధాన వివాహ ముహూర్తాన్ని అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు ఖరారు చేశారు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. నారా రోహిత్ పెళ్లి వేడుకల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఈ పెళ్లి టాలీవుడ్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.









