Search
Close this search box.

  నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దంపతుల తొలి దీపావళి వేడుకలు వైరల్

టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ గతేడాది నవంబర్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోనున్న ఈ జంట, తాజాగా తమ తొలి దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. హిందూ సాంప్రదాయాల పట్ల అమితమైన గౌరవం ఉన్న శోభిత, తన భర్తతో కలిసి దీపాలు వెలిగించారు. తమ మధ్య ఉన్న అన్యోన్యమైన ప్రేమ బంధాన్ని తెలియజేసేలా, ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

శోభిత ధూళిపాళ షేర్ చేసిన దీపావళి వేడుకల ఫోటోలలో, చైతూ-శోభిత ఇద్దరూ సంప్రదాయమైన దుస్తుల్లో ఆకట్టుకున్నారు. నాగ చైతన్య కుర్తా ధరించగా, శోభిత పర్పుల్ డ్రెస్సులో అందంగా కనిపించారు. ముఖ్యంగా దీపాల వెలుగులో శోభిత మరింతగా మెరిసిపోయారు. అక్కినేని జోడీ దీపావళి వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా సందడి చేస్తున్నాయి.

గత పది నెలల కాలంలో ఈ జంట ప్రతీ సందర్భాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటూ ముందుకు సాగారు. తాజాగా వీరి తొలి దీపావళి వేడుక ఫోటోలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతూ, కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు