Search
Close this search box.

  ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ దుమ్మురేపింది: ఫస్ట్ డే రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!

కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ శుక్రవారం (అక్టోబర్ 17, 2025న) ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాల తర్వాత ప్రదీప్ ‘డ్యూడ్’తో హ్యాట్రిక్ హిట్ కొట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపరిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ఈ వసూళ్లను ప్రకటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘డ్యూడ్’ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది, “బాక్సాఫీస్ వద్ద ‘డ్యూడ్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ. 22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది” అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక భారతదేశంలోనూ ‘డ్యూడ్’ సినిమా మొదటి రోజు క్రేజీ కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ డే రూ. 10 కోట్లకు నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇందులో తమిళంలో రూ. 6.5 కోట్లు మరియు తెలుగులో రూ. 3 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు