పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఒక భారీ సినిమా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ లాక్ చేసుకున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్మాణ సంస్థ పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి గుర్తింపు పొందింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, పవన్‌తో సినిమా చేయబోతుందన్న వార్త ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్‌పై పరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశం తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాక్ వినిపిస్తోంది. లోకేశ్ రూపొందించిన ‘ఖైతి’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాయి. పవన్ వంటి భారీ స్టార్‌తో లోకేశ్ జతకడితే, ఆ సినిమా పాన్-ఇండియా స్థాయిలో భారీ హైప్ సాధించడంలో సందేహం లేదు. అయితే, మరోవైపు ‘తానా సెరంధ కోట్టం’, ‘నర్కొండ పార్వై’, ‘వలిమై’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి లోకేశ్ కనకరాజ్ లేదా హెచ్. వినోద్ – ఈ ఇద్దరిలో ఎవరు దర్శకుడు అనేది ఇంకా స్పష్టత రానిప్పటికీ, పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’ వంటి భారీ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే కేవీఎన్ ప్రొడక్షన్స్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ కాంబినేషన్ (ముఖ్యంగా పవన్ x లోకేశ్ కనకరాజ్) ఫైనల్ అయితే, అది టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినిమా ప్రపంచంలో కూడా భారీ సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.









