సినీ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మంత్రముగ్ధుల్ని చేసే హీరోయిన్ మాళవిక మోహనన్, తాజాగా గ్రీస్ వెకేషన్ సందర్భంగా చేసిన గ్లామర్ ఫోటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. వెరైటీ వస్త్రధారణలో తళుక్కుమంటూ కనిపించిన ఈ కేరళ బ్యూటీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మాళవిక, ట్రెండీ ఫొటోషూట్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితం మరియు సినిమాల అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తుంటుంది.
ప్రస్తుతం మాళవిక మోహనన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab Movie) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, స్టిల్స్‌లో మాళవిక – ప్రభాస్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ పంపిన స్పెషల్ ఫుడ్‌తో మాళవిక ఆనందంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. కేరళలో జన్మించిన మాళవిక, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె. ఆమె ‘పట్టం పొలే’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టి, ‘బియాండ్ ది క్లౌడ్స్’, ‘మాస్టర్’, ‘పేట’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇటీవల మాళవిక చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. “హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, సౌకర్యాలు హీరోయిన్లకు లేవు. నిర్మాతలు హీరోయిన్లతో బేరాలు ఆడుతారు” అంటూ ఆమె బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా, “కెమెరా ముందు ఒక్కలా, కెమెరా కట్టిన తర్వాత మరోలా ఉండే నటులు ఉన్నారు” అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె ‘ది రాజా సాబ్’తో పాటు తమిళంలో ‘సర్దార్ 2’ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రీస్ వెకేషన్ ఫోటోషూట్ ఆమె అభిమానుల మధ్య వైరల్‌గా మారింది









