Search
Close this search box.

  మీసాల పిల్ల: చిరంజీవి, నయనతార పాటలోనే కథాంశం లీక్ చేసిన అనిల్ రావిపూడి; ‘పాత కథ’ అంటూ మెగా అభిమానుల్లో అసంతృప్తి

మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే ఫస్ట్ సింగిల్‌పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటపై మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకుల నుంచి కొంత డివైడ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ప్రోమో వచ్చినప్పటి నుంచే ట్రోలింగ్ మొదలుపెట్టారు. సాంగ్ సెటప్, చిరంజీవి లుక్స్, విజువల్స్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ విమర్శల కంటే కూడా, ఫస్ట్ సింగిల్‌గా ఈ పాట రిలీజ్ చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు మెగా ఫ్యాన్స్ గ్రూప్స్‌లో వ్యక్తమవుతున్నాయి.

‘మీసాల పిల్ల’ పాటలో చిరంజీవి, నయనతార భార్యాభర్తలుగా కనిపించగా, పాటలోని సాహిత్యం ద్వారా దర్శకుడు అనిల్ రావిపూడి కథాంశం ఏంటనేది దాదాపు లీక్ చేశారు. “రాజీ పడదామంటే రావేం మాజీ ఇల్లాలా.. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా..” వంటి పదాల వల్ల.. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారని, మళ్లీ వారిని కలపడానికి శంకర వరప్రసాద్ గారు ప్రయత్నిస్తున్నారనే స్టోరీ లైన్ అర్థమైపోయింది. ఇలా ఒక్క పాటతోనే కంటెంట్ ఏంటనేది చెప్పేయడాన్ని మెగా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇది ‘డాడీ’, ‘విశ్వాసం’, ‘తులసి’ వంటి పాత సినిమాల మిక్స్ లా ఉందనే నెగెటివ్ కామెంట్లు రావడంతో ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.

అయితే, కొందరు విశ్లేషకులు దీనిని ప్రచార వ్యూహంలో భాగమని కూడా అభిప్రాయపడుతున్నారు. సినిమా కథ ఏంటనేది ముందే చూచాయగా చెప్పేసి, సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్‌తో వస్తున్నామని ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకుంటున్నారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, పండక్కి ఆయన సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈసారి కూడా అదే మ్యూజిక్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు