ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ భారీ సినిమా అనౌన్స్ అయిన విషయం సినీ లవర్స్ మర్చిపోలేరు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అప్పట్లో ముందుకెళ్లలేదు.
అయితే, ఈ మల్టీ-స్టార్ వాల్యూ ఉన్న సినిమా ప్రాజెక్ట్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రకారం, ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని బజ్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను పూర్తిచేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి కూడా డేట్స్ కేటాయించనున్నారని టాక్ వినిపిస్తోంది.
హీరోలను స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించడంలో దిట్ట అయిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ను ఎలాంటి యాంగిల్లో ప్రెజెంట్ చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇటీవలే ‘ఓజీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవన్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తాడా లేదా? అనేది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ డిస్కషన్ పాయింట్‌గా మారింది..









