ఇప్పట్లో సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పార్ట్-2 ప్లాన్ చెయ్యడం కామన్‌గా మారింది. తాజాగా విడుదలైన ఓజీ (OG) సినిమాకి కూడా దర్శకుడు సుజీత్ క్లైమాక్స్‌లో సీక్వెల్ హింట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
OGకి వచ్చిన స్పందన
సాహోతో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్, ఈసారి ఓజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్‌కి ముందు భారీ హైప్ ఉన్నా, థియేటర్లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సాధారణ ప్రేక్షకులు “పర్వాలేదు” అంటుండగా, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం “బ్లాక్‌బస్టర్” అంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. మొదటి రోజు వసూళ్లే 100 కోట్లకు దగ్గరగా ఉంటాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
OG 2లో స్టోరీ ఎలా?
క్లైమాక్స్‌లో చూపించిన హింట్ ప్రకారం —
- పవన్ కళ్యాణ్ జపాన్ యూజికులను అంతం చేయడం వల్ల అక్కడ శత్రువులను సంపాదించాడు.
- ముంబైలో ఓమీని చంపడంతో డేవిడ్ భాయ్‌కి కూడా శత్రువయ్యాడు.
ఇక OG పార్ట్-2లో ఈ ఇద్దరు విలన్స్ కలసి హీరోపై ప్రతీకారం తీర్చుకునేలా కథ మలచబోతున్నారని టాక్. అదనంగా, పవన్ కళ్యాణ్ జపాన్ వెళ్లి చనిపోయాడనే పుకార్ల చుట్టూ సీక్వెల్ స్టోరీ నడుస్తుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రశ్నే!
సినిమా క్లైమాక్స్‌లో టైటిల్ కార్డ్ వేసి OG పార్ట్-2ని అధికారికంగా సూచించారు. ఇది ఎక్కువగా జపాన్ బ్యాక్‌డ్రాప్లో ఉండబోతుందని సమాచారం. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే — పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారా లేదా అనేది. ఎందుకంటే ఆయన మూడు సినిమాలు మాత్రమే చేస్తానని ఇప్పటికే చెప్పేశారు.
ఇక హరిహర వీరమల్లుకి కూడా సీక్వెల్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఓజీకి కూడా పార్ట్-2 యాడ్ కావడంతో, ఆయనపై ప్రాజెక్టుల లిస్ట్ మరింత పెరిగింది. అసలు పవన్ ఈ సీక్వెల్స్‌కి సమయం కేటాయిస్తారా లేదా అనేది ముందు ముందు తేలనుంది..









