Search
Close this search box.

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మంచు మనోజ్..?

సినీ రంగంలో నటీనటుల కెరీర్‌ ఎప్పుడెప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమే. కొందరు హీరోగా ప్రవేశించి విలన్‌గా రాణిస్తారు, మరికొందరు విలన్‌ ఇమేజ్‌తో మొదలుపెట్టి తర్వాత హీరోగా నిలుస్తారు. అలాంటి ప్రయాణం చేసిన వారిలో మంచు మోహన్‌బాబు ఒకరు. ఆయన తొలుత హీరోగా పరిచయమయ్యాక విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. తరువాత ‘ప్రతిజ్ఞ’లాంటి సినిమాలతో మళ్లీ హీరోగా రాణించి, విలన్‌ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు.

ఇప్పుడు ఆయన కుమారుడు మంచు మనోజ్‌ కూడా అదే తరహా మార్గంలో అడుగులు వేస్తున్నాడు. హీరోగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయికి ఆయన కెరీర్‌ చేరలేదు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘భైరవం’ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చిన మనోజ్‌, తాజాగా విడుదలైన మిరాయ్లో మహాబీర్‌ లామా అనే విలన్‌ పాత్రలో తన పెర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పాత్రతో మనోజ్‌కి కొత్త ఊపు వచ్చి, పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కుతున్నాయి.

 

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించే చిత్రంలో విలన్‌గా మనోజ్‌ని తీసుకోవాలన్న ఆలోచన దర్శకుడు బాబీకి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన బాబీ – చిరంజీవి కాంబినేషన్‌లో మరో సినిమాకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. విజయదశమి రోజున ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో విలన్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, దాన్ని మనోజ్‌ పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం బాబీకి ఉన్నట్టుగా సమాచారం. మిరాయ్ సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవనున్నాడని చెబుతున్నారు.

అయితే మంచు మనోజ్‌ నిజంగానే మెగాస్టార్‌ సినిమాలో విలన్‌గా కనిపిస్తాడా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు