Search
Close this search box.

  మిరాయ్ లో రెబల్ స్టార్..! సర్ప్రైజ్ మామూలుగా లేదుగా…

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయ్ వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమైంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, టీజర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి

ఈ సినిమాలో ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. వాటిలో హైలైట్ మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సమాచారం ప్రకారం, ఆయన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడట.

సినిమా ఆరంభంలోనే ప్రభాస్ వాయిస్ వినిపించనుందని, అది థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఆయన ఏ విషయాన్ని నెరేట్ చేస్తారో అనే ఆసక్తి పెరుగుతోంది..ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌గా రితికా నాయక్ నటించింది. సంగీతం గౌర హరి అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు