Search
Close this search box.

  ఓజీ vs ఓమి..! ఇక థియేటర్లో రచ్చ రచ్చే..!

ఎక్కడ చూసినా అనిరుద్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కే విపరీతమైన హైప్. ట్విట్టర్‌లో యువత అనిరుద్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు. దీనివల్ల తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్‌లో కొంత అసంతృప్తి నెలకొన్నట్టే అనిపిస్తోంది.

ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ –

“ఓజి సినిమా అనేది మాస్టర్, విక్రమ్, లియో సినిమాలకే సమాధానం అవుతుంది” అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాటను నిజం చేయడానికి తన సంగీతంతో మరింత శ్రమిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలో కూడా తమన్ మ్యూజిక్ అందించాడు. తనంతట తాను పూర్తి న్యాయం చేశాడు కానీ, తన మ్యూజిక్‌కి సరైన జస్టిస్ చేసే సినిమా మాత్రం రాలేదని ఎప్పుడూ ఫీలయ్యేవాడు. ఆ గ్యాప్‌ని భర్తీ చేసే సినిమానే ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి..

ఓజి vs ఓమి

ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన మ్యూజిక్ కంటెంట్ ఒక్కోటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టైటిల్ సాంగ్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించింది. ఇక విలన్‌గా ఇమ్రాన్ హష్మీ ఓమి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకి తమన్ ఇచ్చిన థీమ్ మ్యూజిక్ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..

ఎన్నో వాయిదాల తర్వాత పవన్ కళ్యాణ్ ఓజి సినిమా సరిగ్గా ఇంకో 14 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులన్నింటినీ తీరుస్తుందనే నమ్మకం ఈ సినిమాపై ఉంది. యూనానిమస్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించడం ఖాయం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు