పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా, దర్శకుడు మారుతీ రూపొందిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం “ది రాజా సాబ్”. హారర్ ఫాంటసీ జానర్‌లో వస్తున్న ఈ ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. రాబోయే అక్టోబర్ నుంచి ప్రమోషన్ల దుమారం మొదలుకానుంది.
మొదటగా ట్రైలర్ రిలీజ్ చేసి, ఆ వెంటనే ఫస్ట్ సింగిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు – ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, అంటే అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని. అంతేకాదు, “కాంతార 1”తో కలిపి ట్రైలర్ విడుదల చేయాలని కూడా యూనిట్ భావిస్తోంది. దీంతో అక్టోబర్ నెలలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ఫెస్టివల్ కానుంది..ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఎస్. థమన్..









