‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన తేజ సజ్జ, ఇప్పుడు అదే రేంజ్‌లో మ్యాజిక్ రిపీట్ చేయడానికి ‘మిరాయ్’తో రాబోతున్నాడు. ఈ సినిమాలో తేజ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతుండగా, అతనికి సమానంగా మంచు మనోజ్ మరో కీలక పాత్రలో మెస్మరైజ్ చేయనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం, మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజ సజ్జ చేసిన స్పీచ్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. “ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం” అంటూ చెప్పిన ఆయన మాటలు ఆకట్టుకున్నాయి. అంతేకాదు, థియేటర్లలో టికెట్ రేట్లు అధికంగా ఉండడంతో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారని, అందుకే ‘మిరాయ్’కి ఎలాంటి హైక్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి తక్కువ ధరలో చూడగలిగేలా ప్లాన్ చేశామని ప్రకటించాడు.
అదే కాకుండా, సినిమాలో రెండు స్పెషల్ సర్ప్రైజ్‌లు ఉన్నాయని చెప్పి ఆడియన్స్‌కి అదిరిపోయే హింట్ ఇచ్చాడు. దీంతో గెస్ట్ రోల్స్‌లో ఎవరైనా స్టార్‌లు కనిపిస్తారా అన్న చర్చ మొదలైంది. బడ్జెట్, టెక్నికల్ అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పూర్తయింది. ఇప్పుడు అందరి చూపు థియేటర్లలో వచ్చే పబ్లిక్ టాక్‌పైనే ఉంది..









