పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజి’పై ప్రేక్షకుల్లో క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లతోనే అద్భుతమైన హైప్ సృష్టించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ స్పీడ్‌లో ఉంది.
ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. లండన్‌లోని ప్రసిద్ధ అబ్బీ రోడ్ స్టూడియోస్‌లో 117 మంది మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ జరుగుతోందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అభిమానులు ఆయన డెడికేషన్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది..









