Search
Close this search box.

  ఓజీ ఒక్క టికెట్ ధర రూ. 5 లక్షలు..! ఇదిరా పవర్ స్టార్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్..!

పవన్‌ కళ్యాణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ఓజీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇవాళ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన చిత్రాల నుంచి వరుస అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఇక ఓజీ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ రెడీ అవుతుంది. ఇప్పటికే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ క్రేజీ పోస్టర్ వదిలి పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని డబుల్‌ చేశాడు హరీష్‌ శంకర్‌. ఇక ఇప్పుడు ఓజీ వంతు మిగిలి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ కి ఇంకా కొన్ని రోజులే ఉండటం మూవీ టీం ప్రేమోషన్స్‌ వేగవంతం చేసింది. త్వరలోనే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఒపెన్‌ కానున్నాయి.

అయితే ఓజీ టికెట్‌కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓజీ మూవీ తొలి టికెట్‌ భారీ ధర పలికి రికార్డు నెలకొల్పింది. తెలంగాణ నైజాంలోని ఓజీ మూవీ ఫస్ట్‌ టికెట్‌ని వేలం వేయగా.. ‌ టికెట్‌ ధర అక్షరాల రూ. 5 లక్షలు పలికింది. ఓ సినిమా టికెట్‌ ధర రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే ఓజీ మూవీ ఫస్ట్‌ టికెట్‌ని పవన్‌ అభిమాని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. నార్త్‌ అమెరికాలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఓజీ నైజాం ఫస్ట్‌ టికెట్‌ని కోనుగొలు చేశారట. రూ. 5 లక్షలకు ఓజీ మూవీ నైజాం ఫస్ట్‌ టికెట్‌ని కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక్క టికెట్‌ ధర రూ. 5 లక్షలు పలకడం.. ఇది పవర్‌ స్టార్‌ రేంజ్‌అంటూ అభిమానులు కాలర్‌ ఎగిరేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత పవన్‌ నటిస్తున్న చిత్రాలపై ఓ రేంజ్‌లో బజ్‌ నెలకొంది. రాజకీయాలతో బిజీ అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొని హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్‌ని చక చక పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. జూలై 24న విడుదలైన హరి హర వీరమల్లు దారుణంగా నిరాశపరిచింది. వెయ్యి కోట్ల క్షబ్‌లో చేరిన ఇండస్ట్రీ హిట్‌ కొడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచన వేశాయి. కానీ, విడుదల తర్వాత అంచనాలన్ని తారుమారు అయ్యాయి. మూవీకి మంచి టాక్‌ వచ్చిన.. సెకండాఫ్‌పై విమర్శలు వచ్చాయి. వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌ పేలవంగా ఉన్నాయని, కథలో ల్యాగ్‌ ఉండటంతో హిట్‌ టాక్ రావాల్సిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది.

హరి హర వీరమల్లు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానులంత ఓజీపైనే ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ముందు నుంచి ఓజీపైనే బజ్‌ ఎక్కువగా ఉంది. హరి హర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కంటే కూడా ఓజీ గురించి అంతా మాట్లాడుకున్నారు. కారణం సుజీత్‌ పనితనం.. రెగ్యులర్‌ కథయినా.. సుజీత్‌ టేకింగ్‌, మేకింగ్‌ విభిన్నంగా ఉంటుంది. సినిమాను తెరకెక్కించడంతో సుజిత్‌ విజన్‌ని అంచనల వేయడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుజిత్‌ దర్శకత్వంలో ఓజీ ప్రకటన రాగానే.. సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటి వరకు చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌, పాటలు మరింత హైప్‌ పెంచుతున్నాయి. ఇక మూవీ ప్రమోషన్స్‌ కూడా సినిమాను ఓ రేంజ్‌లో పెట్టేలా కనిపిస్తోంది. మరి విడుదల తర్వాత ఓజీ ఎలాంటి సెన్సేషన్‌ చేస్తుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు