పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లలో తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ సినిమా ఏ రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ సినిమా కథపై ఒక ఆసక్తికరమైన బజ్ వైరల్ అవుతోంది. కథ ప్రకారం – ముంబై అండర్‌వరల్డ్‌లో గంభీరంగా ఎదిగిన ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) అనుకోని పరిస్థితుల్లో అదృశ్యమవుతాడు. దాదాపు పదేళ్ల తర్వాత, అండర్‌వరల్డ్‌ను గట్టిగా పీడిస్తున్న ఓమి భావు (ఇమ్రాన్ హష్మి)ను ఎదుర్కొనేందుకు తిరిగి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత జరిగే యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తాయని టాక్.
ఈ కథ వింటే, రజనీకాంత్ నటించిన లెజెండరీ మూవీ ‘భాషా’ గుర్తుకు వస్తోంది. అయితే, ఓజస్ గంభీర ఎందుకు మాయమయ్యాడు? తిరిగి రావడానికి ఏం కారణం? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం సినిమా థియేటర్లలో మాత్రమే దొరుకుతుంది.
ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తూ, సెప్టెంబర్ 25న ‘ఓజి’ను గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు..