Search
Close this search box.

  హృతిక్ – ఎన్టీఆర్ వార్ స్టార్ట్..! వార్ 2 ట్రైలర్ డేట్ లాక్..

July 23, 2025 9:22 PM | Aditya369 News

హృతిక్ – ఎన్టీఆర్ వార్ స్టార్ట్..! వార్ 2 ట్రైలర్ డేట్ లాక్..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ విడుదలకు టైమ్ పడుతోంది. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు..ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన మేకర్స్, తాజాగా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల కానుంది..ఇక ట్రైలర్ నిడివి 2 నిమిషాలు 39 సెకన్లు కాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) U/A సర్టిఫికేట్ (16+) మంజూరు చేసింది. ఈ ట్రైలర్‌తో సినిమా పైన అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది..ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో అదరగొట్టబోతుండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. కియారా అద్వానీ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇది యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో ఆరవ సినిమా కావడం విశేషం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు