Search
Close this search box.

  హీరోయిన్ హనీ రోజ్‌పై అసభ్య ప్రవర్తన… వీడియోలు వైరల్..!

March 30, 2026 11:54 PM | Aditya369 News

హీరోయిన్ హనీ రోజ్‌పై అసభ్య ప్రవర్తన… వీడియోలు వైరల్..!

తెలుగు, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ హనీ రోజ్‌కు కేరళలో అసౌకర్యకరమైన ఘటన ఎదురైంది. ఒక కొత్త షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు మాల్ వద్దకు చేరుకున్నారు. మొదట పరిస్థితి సజావుగానే ఉన్నప్పటికీ, ఆమె లోపలికి ప్రవేశించే సమయంలో ఒక్కసారిగా జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో కొందరు హద్దులు దాటి అనుచితంగా ప్రవర్తించారు. సెల్ఫీ తీసుకునే పేరుతో ఆమెకు అత్యంత దగ్గరగా రావడంతో పాటు, అసభ్యంగా తాకే ప్రయత్నాలు కూడా చేశారు.

ఈ అనూహ్య పరిణామంతో హనీ రోజ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఆమె వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, తారల పట్ల గౌరవం ఉండాలని, ఇలాంటి అనుచిత ప్రవర్తన అస్సలు సహించరాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు