టాలీవుడ్లో మాస్ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశలో నిలిచాడు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఆయన తదుపరి అడుగులపై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. మాస్ పల్స్‌ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్, ఇప్పుడు మరింత జాగ్రత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు టాప్ స్టార్స్‌తో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లిన హరీష్, ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో ప్రాజెక్ట్స్‌పై ఆసక్తి చూపాడు. అయితే తాజా ఫలితాల కారణంగా వెంటనే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్‌కు సరిపోయే కథను ఎంచుకోవడం ఆయనకు ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.
దీంతో, మీడియం రేంజ్ హీరోతో కంటెంట్ ఆధారంగా హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గతంలో సుబ్రమణ్యం ఫర్ సేల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అనుభవాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ కోసం కూడా కథలను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.మొత్తానికి, సరైన కథ, సరైన హీరో దొరికితే హరీష్ శంకర్ మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వగలడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









