రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్లో స్పీడ్ పెంచేశారు. ఇప్పటికే “రౌడీ జనార్ధన”, “రణబాలి” వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈసారి నానికు “హాయ్ నాన్న”లాంటి హిట్ అందించిన డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తన టీమ్‌తో కలిసి ఒక ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేయగా, అందులో విజయ్ చేతిలో స్క్వాడ్ డాగ్స్‌తో ముందుకు సాగుతుండగా, వెనుక యూనిట్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ప్రాజెక్ట్‌గా తెలుస్తోంది. “హాయ్ నాన్న” తర్వాత శౌర్యువ్ ఒక కథను ముందుగా ఎన్.టి.ఆర్. కోసం సిద్ధం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా అది జరగకపోవడంతో, అదే కథను విజయ్‌కు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ధృవీకరణ లేదు.
ఈ సినిమాకు సంగీతాన్ని హేసమ్ అబ్దుల్ వాహబ్ అందించనున్నారు. “హాయ్ నాన్న”, “ఖుషి” వంటి చిత్రాలకు ఆయన ఇచ్చిన సంగీతం మంచి స్పందన పొందింది. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుత ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో “రణబాలి”, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో “రౌడీ జనార్ధన” సినిమాలు కూడా కొనసాగుతున్నాయి. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.









