భారతీయ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన తుంబాడ్ కు సీక్వెల్ రాబోతుందన్న వార్త మరోసారి హారర్ అభిమానుల్లో హైప్ పెంచుతోంది. ఇప్పుడు తుంబాడ్ 2 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది—హస్తర్ మళ్లీ వస్తున్నాడు… ఈసారి మరింత భయంకరంగా!
హస్తర్ కథకి కొత్త చాప్టమ్
2018లో విడుదలైన తుంబాడ్ తన డార్క్ కథ, విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు తుంబాడ్ 2లో ఆ హస్తర్ పురాణాన్ని మరింత లోతుగా, పెద్ద స్కేల్లో చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో Sohum Shahతో పాటు Nawazuddin Siddiqui కూడా నటించనున్నారని సమాచారం, దీంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.
నెక్స్ట్ లెవల్ హారర్
డైరెక్టర్ Adesh Prasad తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగంలో చూపించిన మానవ అత్యాశ, మరుగున పడిన దేవతల కథలను ఈసారి మరింత డార్క్, ఇంటెన్స్‌గా చూపించబోతున్నారని టాక్
రీ-రిలీజ్ హైప్
2024లో తుంబాడ్ రీ-రిలీజ్ అయినప్పుడు కూడా భారీ స్పందన లభించి, కోట్లలో కలెక్షన్లు రాబట్టింది. ఇది ఈ కథపై ఉన్న క్రేజ్‌ను మరోసారి ప్రూవ్ చేసింది.
భారీ అంచనాలు
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న తుంబాడ్ 2, అత్యాధునిక టెక్నాలజీతో, మరింత భయానక వాతావరణంతో తెరకెక్కుతోంది. హారర్ జానర్లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఈ సినిమా రెడీ అవుతోంది.
మరి హస్తర్ ఈసారి ప్రేక్షకులను ఎంతవరకు భయపెడతాడో చూడాలి!









