ప్రభాస్ 2026లో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. మొదట “ది రాజా సాబ్”తో రానున్నట్టు అనుకున్నప్పటికీ, ఆ సినిమా వాయిదా పడింది. “కల్కి 2898 AD” తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” షూటింగ్లో బిజీగా ఉన్నారు. మొదట దీపికా పదుకొణె హీరోయిన్గా అనుకున్నప్పటికీ, ఆమె తప్పుకోవడంతో చివరికి తృప్తి డిమ్రీ హీరోయిన్గా ఎంపికయ్యారు..యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్‌ని రూపొందించిన సందీప్ వంగా, “స్పిరిట్”ను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కేవలం ఆరు నెలల్లోనే రెడీ అవుతుందని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ లుక్ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. యంగ్ లుక్ కోసం ఆయన బరువు తగ్గి, కొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు కొత్త తరహా దుస్తుల్లో కనిపించబోతున్నారు. డార్క్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జానర్లో ప్రభాస్ తొలిసారి అడుగు పెడుతున్న ఈ ప్రాజెక్ట్ ఆయనను పూర్తిగా కొత్త జోన్లోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు..గతంలో సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన “కబీర్ సింగ్” (షాహిద్ కపూర్), “యానిమల్” (రణబీర్ కపూర్) సినిమాలు రికార్డు స్థాయి విజయాలు సాధించాయి. ఇప్పుడు “స్పిరిట్” కూడా ఆ రికార్డులను బద్దలు కొడుతుందా అన్నది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ – తృప్తి డిమ్రీ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది..









