పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (‘Spirit’ Movie) గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న వేళ, బాలీవుడ్ అగ్రనటి కాజోల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని టాక్.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ముఖ్యమైన పాత్ర కోసం కాజోల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. కథ విన్న తర్వాత కాజోల్ ఆ పాత్రకు చాలా ఇంప్రెస్ అయి, చేయడానికి సుముఖత వ్యక్తం చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇది కాజోల్కు తొలి తెలుగు సినిమా అవుతుంది. ఆమె గతంలో కొన్ని తమిళ సినిమాల్లో నటించినా, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ ఉన్న కాజోల్ ‘స్పిరిట్’లో భాగమైతే, ఆమె సౌత్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది.








