Search
Close this search box.

  సూర్య 50 కోసం స్టార్ డైరెక్టర్ వేటలో మేకర్స్..!

May 26, 2026 11:12 PM | Aditya369 News

సూర్య 50 కోసం స్టార్ డైరెక్టర్ వేటలో మేకర్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాడు. తాజాగా విడుదలైన ‘కరుప్పు’ సినిమా భారీ విజయాన్ని అందుకుని థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన థియేట్రికల్ హిట్‌గా నిలవడంతో అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సక్సెస్‌తో సూర్య కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌లో వరుస భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే సూర్య తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 50వ సినిమా గురించి కోలీవుడ్‌లో భారీ చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాను నిర్మించిన ప్రముఖ బ్యానర్ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఇప్పుడు సూర్య 50ని నిర్మించడానికి సిద్ధమైందట. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు ఇప్పటికే సూర్యను సంప్రదించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు.. ఈ ల్యాండ్‌మార్క్ మూవీని చాలా భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ డైరెక్టర్‌ను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారని సమాచారం. దర్శకుడు ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రస్తుతం సూర్య చేతిలో కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ జితు మాధవన్‌తో చేస్తున్న ‘సూర్య 47’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు ‘కరుప్పు’ సీక్వెల్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మొత్తానికి సూర్య ఇప్పుడు వరుస భారీ సినిమాలతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు