Search
Close this search box.

  సుజీత్ డైరెక్షన్లో చరణ్..? స్టైలిష్ యాక్షన్ డ్రామా..? ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే..!

September 26, 2025 11:25 PM | Aditya369 News

సుజీత్ డైరెక్షన్లో చరణ్..? స్టైలిష్ యాక్షన్ డ్రామా..? ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే..!

ఓజీ సినిమాతో మెగా ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకొచ్చాడు డైరెక్టర్ సుజీత్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ను పవర్ ప్యాక్డ్ రోల్‌లో చూపించి అదరగొట్టిన ఈ కుర్ర దర్శకుడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు పన్నెండేళ్ల కలను నెరవేర్చాడని సుజీత్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారు.

బాక్సాఫీస్ దగ్గర కూడా ఓజీ ఊహించని స్థాయిలో దూసుకెళ్లింది. మొదటి రోజే రూ.154 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కొత్త రికార్డులు సృష్టించింది. దీంతో అభిమానులు మాత్రమే కాదు, సినిమా యూనిట్ కూడా సంతోషంలో మునిగిపోయింది.

ఇదిలా ఉంటే, ఓ ఇంటర్వ్యూలో సుజీత్ ఇంట్రస్టింగ్ రివీల్ చేశాడు. సాహో తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ప్లాన్ చేశానని చెప్పాడు. ఆ కథ చరణ్‌కి కూడా నచ్చిందని, యూవీ క్రియేషన్స్ నిర్మించడానికి సిద్ధమైందని తెలిపాడు. కానీ అధికారిక అనౌన్స్‌మెంట్ చేసే సమయానికి అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని వెల్లడించాడు.

ఈ మాటలు విన్న రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. “సుజీత్ టేకింగ్ నెక్స్ట్ లెవల్… చరణ్‌తో సినిమా చేసి ఉంటే అదిరిపోయేది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ స్క్రిప్ట్ రెడీగా ఉంటే రామ్ చరణ్‌తో సినిమా చేయాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో భారీ సినిమా చేస్తున్నారు. మరి, భవిష్యత్తులో చరణ్–సుజీత్ కాంబో నిజం అవుతుందా అన్నది చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు