Search
Close this search box.

  సినీ ఇండస్ట్రీ చీకటి కోణం: ప్రకాష్ రాజ్ వైఫ్ రోల్ కోసం ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు – మిర్చి మాధవి

November 29, 2025 10:48 PM | Aditya369 News

సినీ ఇండస్ట్రీ చీకటి కోణం: ప్రకాష్ రాజ్ వైఫ్ రోల్ కోసం ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు – మిర్చి మాధవి

దాదాపు 300 పైగా సినిమాలు, 20 సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి మిర్చి మాధవి (Mirchi Madhavi), తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో దేవయానిగా, ప్రస్తుతం ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో భాగ్యం పాత్రలో నటిస్తున్న మాధవి, ఆఫర్లు ఇస్తామని చెప్పి కొందరు ఎలా ఇబ్బంది పెడతారో కళ్లకు కట్టారు.
ఆమె మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తన అనుభవాలను పంచుకున్నారు. ఒకసారి ఒక డైరెక్టర్ తన ఇంటికి వచ్చి, ఆడిషన్ పేరుతో చీర కట్టుకుని నడిచి చూపించమని, ఆ తర్వాత నడుము చూపించమని అడిగినట్లు తెలిపారు. ఆ మాట వినగానే తాను సహనం కోల్పోయి, చెప్పు తీసుకుని కొడతానని బెదిరించి అతన్ని బయటకు గెంటేశానని మాధవి ధైర్యంగా వెల్లడించారు. ఇంట్లో ఆడాళ్లమే ఉన్నామనే భయం కూడా అప్పుడు తనను వెంటాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక, మరో సంఘటనలో '100% లవ్' సినిమా తర్వాత తనకు ప్రకాష్ రాజ్ పక్కన భార్య పాత్ర ఆఫర్ ఇస్తామని చెప్పి, అది కావాలంటే తాము ఐదుగురు ఉంటామని, కాంప్రమైజ్ అయితేనే ఆ రోల్ ఇస్తామని ఒకరు అడిగినట్లు మాధవి తెలిపారు. అలాంటి దాన్ని అయితే అప్పుడే అదే పని చేసేదాన్ని, డబ్బులు సంపాదించేదాన్ని అని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె, ఆఫర్ల కోసం క్లోజ్డ్ రూమ్‌కి వెళ్తున్నారంటే అది కాంప్రమైజ్ కోసమే అని, లబ్ధి పొందనప్పుడు గోల చేయడం సరికాదని కూడా మాధవి అభిప్రాయపడ్డారు.

దాదాపు 300 పైగా సినిమాలు, 20 సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి మిర్చి మాధవి (Mirchi Madhavi), తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో దేవయానిగా, ప్రస్తుతం ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో భాగ్యం పాత్రలో నటిస్తున్న మాధవి, ఆఫర్లు ఇస్తామని చెప్పి కొందరు ఎలా ఇబ్బంది పెడతారో కళ్లకు కట్టారు.

ఆమె మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తన అనుభవాలను పంచుకున్నారు. ఒకసారి ఒక డైరెక్టర్ తన ఇంటికి వచ్చి, ఆడిషన్ పేరుతో చీర కట్టుకుని నడిచి చూపించమని, ఆ తర్వాత నడుము చూపించమని అడిగినట్లు తెలిపారు. ఆ మాట వినగానే తాను సహనం కోల్పోయి, చెప్పు తీసుకుని కొడతానని బెదిరించి అతన్ని బయటకు గెంటేశానని మాధవి ధైర్యంగా వెల్లడించారు. ఇంట్లో ఆడాళ్లమే ఉన్నామనే భయం కూడా అప్పుడు తనను వెంటాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాక, మరో సంఘటనలో ‘100% లవ్’ సినిమా తర్వాత తనకు ప్రకాష్ రాజ్ పక్కన భార్య పాత్ర ఆఫర్ ఇస్తామని చెప్పి, అది కావాలంటే తాము ఐదుగురు ఉంటామని, కాంప్రమైజ్ అయితేనే ఆ రోల్ ఇస్తామని ఒకరు అడిగినట్లు మాధవి తెలిపారు. అలాంటి దాన్ని అయితే అప్పుడే అదే పని చేసేదాన్ని, డబ్బులు సంపాదించేదాన్ని అని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె, ఆఫర్ల కోసం క్లోజ్డ్ రూమ్‌కి వెళ్తున్నారంటే అది కాంప్రమైజ్ కోసమే అని, లబ్ధి పొందనప్పుడు గోల చేయడం సరికాదని కూడా మాధవి అభిప్రాయపడ్డారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు