టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే ఆయన… ఇప్పుడు తన కెరీర్లో 16వ చిత్రంగా ఓ పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘సమవర్తి’ అనే ఇంటెన్స్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా… తాజాగా విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన ఈ మూవీ… సత్యదేవ్ కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ‘ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’ జానర్లో తెరకెక్కిస్తున్నారు. అంటే ప్రకృతి, పర్యావరణం బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ యాక్షన్ డ్రామా అన్నమాట. “వన్ హెల్ ఆఫ్ ఏ వైల్డ్ రైడ్” అనే ట్యాగ్‌లైన్ చూస్తేనే సినిమా ఎంత రా అండ్ వైల్డ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకు ఇంటెన్స్, క్లాస్ పాత్రల్లో కనిపించిన సత్యదేవ్… ఈసారి మాత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నారని టాక్. ముఖ్యంగా ఈ సినిమా ఆయన కెరీర్లోనే హైయెస్ట్ యాక్షన్ డోస్ ఉన్న మూవీగా నిలవనుందట.
ఇక ‘సమవర్తి’ అనే టైటిల్‌కీ ప్రత్యేకమైన అర్థం ఉంది. పురాణాల్లో యమధర్మరాజును ‘సమవర్తి’ అని కూడా పిలుస్తారు. అంటే అందరికీ సమానంగా న్యాయం చేసేవాడు… తప్పు చేసిన వారిని శిక్షించేవాడు. ఇక ఈ సినిమా కథ కూడా అదే లైన్లో ఉండబోతుందనే హింట్ టైటిల్‌తోనే ఇచ్చేశారు మేకర్స్. ప్రకృతిని నాశనం చేసే వారిపై హీరో యముడిలా విరుచుకుపడే పవర్ఫుల్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారట.
ఈ చిత్రానికి అజయ్ నాగ్ వి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత స్టూడియోస్ బ్యానర్లపై జక్కిడి శివ, శశిధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో, పాన్ సౌత్ రేంజ్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు… ఈ చిత్రాన్ని తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. “హంటింగ్ సూన్ ఇన్ థియేటర్స్” అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్‌తో… ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు మంచి ఆసక్తి నెలకొంది.
మరి కంటెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్… ‘సమవర్తి’తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర గట్టిగా గర్జిస్తాడో లేదో చూడాలి.









