Search
Close this search box.

  విజయ్ ‘జన నాయకన్’కు మరో షాక్..! రిలీజ్‌పై భారీ సస్పెన్స్..!

June 30, 2026 9:56 PM | Aditya369 News

విజయ్ ‘జన నాయకన్’కు మరో షాక్..! రిలీజ్‌పై భారీ సస్పెన్స్..!

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ చేసిన చివరి సినిమాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, గత కొన్ని నెలలుగా వివాదాలు, సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోకుండా వాయిదాలు పడుతోంది.

ఈ సినిమా వ్యవహారం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై స్పష్టత రాలేదు. దీంతో అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదల మరింత ఆలస్యమైతే డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు, ఈ చిత్ర నిర్మాత కె. వెంకట్ నారాయణను తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పుడు అభిమానుల మనసులో ఒక్కటే ప్రశ్న... విజయ్ స్వయంగా రంగంలోకి దిగి తన చివరి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారా? లేక 'జన నాయకన్' విడుదల కోసం ఇంకా వేచి చూడాల్సిందేనా? అనే ఆసక్తి నెలకొంది.

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ చేసిన చివరి సినిమాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, గత కొన్ని నెలలుగా వివాదాలు, సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోకుండా వాయిదాలు పడుతోంది.

ఈ సినిమా వ్యవహారం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై స్పష్టత రాలేదు. దీంతో అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదల మరింత ఆలస్యమైతే డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు, ఈ చిత్ర నిర్మాత కె. వెంకట్ నారాయణను తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పుడు అభిమానుల మనసులో ఒక్కటే ప్రశ్న… విజయ్ స్వయంగా రంగంలోకి దిగి తన చివరి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారా? లేక ‘జన నాయకన్’ విడుదల కోసం ఇంకా వేచి చూడాల్సిందేనా? అనే ఆసక్తి నెలకొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు