స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన స్నేహితురాళ్లతో కలిసి ఇటీవల శ్రీలంక వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన బిజీ షెడ్యూల్ నుంచి రెండు రోజుల విరామం తీసుకున్న ఆమె, తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే, ఇది కేవలం సాధారణ ట్రిప్ కాదని, నటుడు విజయ్ దేవరకొండతో పెళ్లికి ముందు జరుపుకుంటున్న ‘బ్యాచిలరేట్ పార్టీ’ అని అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
రష్మిక ఈ పర్యటనను కేవలం ఫ్రెండ్స్ ట్రిప్‌గా పేర్కొన్నప్పటికీ, అభిమానులు మాత్రం కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “అబద్ధం చెప్పకు రష్మిక.. ఇది నీ బ్యాచిలరేట్ పార్టీయే కదా?” అని చాలామంది సరదాగా ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా రష్మిక మరియు విజయ్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వస్తున్న వార్తలకు ఈ ట్రిప్ మరింత బలాన్నిచ్చింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే అక్టోబర్ 3న పూర్తి కాగా, 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక తన చిరకాల స్నేహితురాళ్లతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు రష్మిక కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ తమ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.









