ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ ఫీవర్ నడుస్తోంది. ఒకవైపు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ టీజర్ సంచలనం సృష్టిస్తుంటే… మరోవైపు ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న SSMB29 (వారణాసి)పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
రణ్‌బీర్ రాముడి లుక్ క్లాసీగా కనిపించినా… రాజమౌళి చూపించబోయే మహేష్ బాబు రాముడి విశ్వరూపం ముందు అది నిలబడగలదా? అన్న డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాముడిగా ఆయన లుక్ చాలా ప్రశాంతంగా, క్లాసీగా కనిపిస్తోంది.
కానీ… జక్కన్న ఫ్యాన్స్ మాత్రం “రాజమౌళి రేంజ్ వేరే లెవెల్” అంటున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్టాండర్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న SSMB29లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని గట్టిగా చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది.
“ఒక్క రామాయణ షాట్ కోసం ఎన్ని రోజులైనా కష్టపడతా” అన్న ఆయన కామెంట్… సినిమా మీద అంచనాలను డబుల్ చేసింది.
దీంతో… మహేష్ బాబు రాముడి లుక్ రివీల్ అయితే సోషల్ మీడియా షేక్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఎస్.ఎస్. రాజమౌళి సాధారణ పౌరాణిక చిత్రంగా కాకుండా… గ్లోబల్ అడ్వెంచర్‌గా మలుస్తున్నారు








