Search
Close this search box.

  ‘రౌడీ జనార్దన’లో మాస్ బీట్..! విజయ్‌తో ప్రీతి ముకుందన్ డాన్స్..?

May 25, 2026 8:21 AM | Aditya369 News

‘రౌడీ జనార్దన’లో మాస్ బీట్..! విజయ్‌తో ప్రీతి ముకుందన్ డాన్స్..?

యువ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ మాస్ ఐటెం సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నర్తించేందుకు ప్రీతి ముకుందన్‌ను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్.. ఇప్పుడు విజయ్‌తో స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఎనర్జీ, డ్యాన్స్ స్టైల్‌కు ప్రీతి గ్లామర్ తోడైతే ఈ సాంగ్ థియేటర్లలో మాస్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఫుల్ యాక్షన్ మోడ్‌లో విజయ్!

ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందట. ముఖ్యంగా ఆ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ ఫుల్ మాస్ అండ్ రగ్గడ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ ఎలివేషన్స్ సినిమాకే మెయిన్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రాజశేఖర్ పాత్రపై భారీ హైప్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఆయన లుక్, క్యారెక్టర్ డిజైన్ ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతుందని సమాచారం. దీంతో సినిమాలో రాజశేఖర్ పాత్రపై కూడా మంచి ఆసక్తి నెలకొంది.

ఇక విజయ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. గ్రామీణ బ్యాక్‌డ్రాప్, మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు