అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖిల్ కొత్త సినిమా ‘లెనిన్’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
విశాఖపట్నంలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విడుదలైన ఈ ట్రైలర్ మొదటి నుంచే ఆసక్తిని పెంచేసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా కింగ్ నాగార్జున చెప్పిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు అదనపు హైప్ తీసుకొచ్చింది.
‘వినరో భాగ్యము విష్ణుకథ’తో గుర్తింపు పొందిన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లెనిన్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే మాస్ యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నింటినీ సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదల కానున్న ‘లెనిన్’ అఖిల్ కెరీర్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









