Search
Close this search box.

  రామ్ చరణ్ ‘పెద్ది’ మరోసారి వాయిదా..! కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

April 15, 2026 9:31 PM | Aditya369 News

రామ్ చరణ్ ‘పెద్ది’ మరోసారి వాయిదా..! కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రతిభావంతమైన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదల మరోసారి వాయిదా పడింది. మొదట ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం, సినిమా టాకీ పార్ట్ పూర్తిగా పూర్తయింది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిట్ చేసిన వర్షన్‌ను చూసిన టీమ్, సినిమా అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.

“ప్రేక్షకులకు అత్యుత్తమ థియేటర్ అనుభవం అందించాలనేది మా లక్ష్యం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ మరియు టెక్నికల్ పనులకు మరింత సమయం కేటాయిస్తున్నాం. ప్రతి అంశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం” అని నిర్మాతలు వెల్లడించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్‌లో ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు